ఆముదాలవలస ( జనస్వరం ) : నియోజకవర్గం బూర్జ మండలం మదనాపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు స్థానికంగా జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో స్థానిక వైసిపి కి చెందిన కొందరు దుండగులు వారిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం దాడిలో గాయపడ్డ గల్లంకి శ్రీనివాసరావు మరియు సావిత్రమ్మ లను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు గారు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని వారిని పరామర్శించి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ నేతల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార పార్టీ నాయకులు తరచూ ఇటువంటి భౌతిక దాడులకు దిగుతున్న పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తోందని మండిపడ్డారు.జనసేన కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.