ఆమదాలవలస, (జనస్వరం) : షుగర్ ఫ్యాక్టరీ దగ్గర షేర్ హోల్డర్స్, రైతులుతో కలిసి ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ పేడాడ. రామ్మోహన్ రావు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను అని ఆమదాలవలస నడిబొడ్డున వాగ్దానం చేసిన జగన్ మోహన్ రెడ్డి గెలిసిన తరువాత ఆ సమస్యనే పట్టించుకోవడం మానేశారు. అలానే నియోజకవర్గంలో నన్ను గెలిపిస్తే రెండేళ్లలో ఫ్యాక్టరీ తెలిపిస్తాను లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన తమ్మినేని సీతారాం ఇప్పుడు ఏమీ పట్టనట్టుగా ప్రవర్తిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలను నమ్మించి మోసం చేశారు, రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారు అని మండిపడ్డారు. CPM పార్టీ నాయకులు బొడ్డేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సరే ప్రభుత్వం APIIC కి అప్పచెప్పడం ఏమిటి అని ప్రశ్నించారు. రైతులు మాట్లాడుతూ ఈ షుగర్ ఫ్యాక్టరీ ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు చెరుకు పంటకు సాగు నీరు అనుకూలంగా ఉంది అని ప్రభుత్వం తొందరగా మేలుకొని ఫ్యాక్టరీ తెరిపించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ధన్నాన లచ్చయ్య, సాదు రామారావు, పైడి వాసుదేవ రావు, మురళీ మోహన్, ధనుంజయ రావు, గణేష్, సింహాచలం, కోటేశ్వరరావు, సురేష్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.