గ్రేటర్ లో వీర జవాన్లకు నివాళులు అందించిన జనసేన నాయకులు
జమ్ముకాశ్మీర్ కుపర్వలో, పాకిస్తాన్ తీవ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన సైనికుల ఆత్మశాంతి కొరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ జనసేన పార్టీ గ్రేటర్ తరపున సంధ్య వేళ 7:00 గంటలకు గ్రేటర్ హైదరాబాద్ లోని సుభాష్ నగర్ 130 డివిజన్లో కమిటీ సభ్యులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు. వీరమరణం పొందిన సైనికుల ఫోటోల ఫ్లెక్సీతో జనసేన జెండాలతో కండువాలు ధరించి ఫాక్స్ సాగర్ కట్ట నుండి లాస్ట్ బస్టాప్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద స్లొగన్స్ చెప్తూ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ సకలాబత్తుల, మేర్ల దుర్గా ప్రసాద్, అమర్, గణేష్, ప్రకాష్, రమ్య సకలాబత్తుల, కుందారపు సంతోషి యాదవ్,మేర్ల నాగేంద్ర, సతీష్, ముత్యాల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.