కర్నూల్ జిల్లా గోనెగండ్ల, ఆయుష్ శాఖ, ప్రభుత్వ యునాని వైద్యశాల, యునాని వైద్య అధికారి డాక్టర్.ఖాద్రి గారు ఆనందయ్య మందు తయారికి ఎంపిక కావడంతో ఎమ్మిగనూరు మెగాఫ్యాన్స్ సేవా సమితి తాలూకా అధ్యక్షులు, జనసేన నాయకులు రాహుల్ సాగర్, గోనెగండ్ల మండల అధ్యక్షులు మాలిక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సంధర్బంగా డాక్టర్ ఖాద్రి గారు మాట్లాడుతూ రాయలసీమ జోన్ పరిధి నుంచి గతవారం రోజుల క్రితం విజయవాడలో జరిగిన డెమోకు హాజరై మందు తయారీ గురించి తెలుసుకొని స్వతహాగా తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల12వ తేదీ కర్నూలులో జరుగు రాయలసీమ జిల్లాల నుంచి డెమోలో పాల్గొనే కడప, కర్నూలు, అనంతపురం, జిల్లాలకు చెందిన ఆయుర్వేద/యునాని వైద్యులకు డాక్టర్ ఖాద్రి గారు డెమో ఇస్తున్నట్లు తెలిపారు. కొన్ని మూలికలు దొరికినా, కొన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాతలు ముందుకు వచ్చి కొన్ని వస్తు సామగ్రిలు అందిస్తే ప్రజలకు ఆనందయ్య మందు తయారు చేసి ఉచితంగా అందిస్తామని తెలిపారు. రాహుల్ సాగర్ మాట్లాడుతూ, ఆనందయ్య మందు తయారికి రాయలసీమ జోన్ లో కర్నూలు జిల్లాలోనే గోనెగండ్ల ఎంపిక కావడం మండల ప్రజల అదృష్టం అన్నారు. డాక్టర్ ఖాద్రి గారి గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు జాగ్రత్తలు పలు సూచనలు ఇస్తూ, కరోనా వ్యాధి పై గ్రామవిధుల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఉన్న భయాలను దూరం చేస్తూ ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. కరోనా బాధితులకు ఉపశమనం కలిగించే ఆనందయ్య మందు గోనెగండ్లలో తయారు చేయడం గ్రామ ప్రజల అదృష్టం అన్నారు. మందుల తయారి సామాగ్రి అందించే దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెగాఫ్యాన్స్ సేవాసమితి సభ్యులు, జనసేన నాయకులు ఖాసీం సాహెబ్, చాంద్ బాషా, పులికొండ, పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com