
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం సుబ్బయమ్మ పేట గ్రామంలో పాఠంశెట్టి సూర్యచంద్ర గారి ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన ఇంటి పంట విత్తనాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే గ్రామ అభివృద్ధి, సేవా కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ సహకారంతో నియోజకవర్గంలోని సుబ్బయ్యమ్మపేట గ్రామంలో ఉన్న దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేయడం జరిగింది. అలాగే NRI జనసైనికులు సహకారంతో ఏర్పాటు చేయబడ్డ జనసేన సంచార గ్రంధాలయం ప్రారంభహోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న జనసేన పార్టీ PAC సభ్యులు పంతంనానాజీ గారు, PAC సభ్యులు శ్రీ కందులదుర్గేష్ గారు, పిఠాపురం జనసేన నాయకులు శ్రీ తలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు మరియు మండల పార్టీ ప్రెసిడెంట్స్, జగ్గంపేట సమన్వయకర్త బోదిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు, స్థానిక జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.