చీపురుపల్లి ( జనస్వరం ) : కుమరాం గ్రామంలో భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆ గ్రామానికి చెందిన అంబేద్కర్ ఆశయ సాధకులు బూర సూర్యనారాయణ మరియు గ్రామ పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చీపురుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కో ఆర్డినేటర్ (ఇంచార్జ్ ) శ్రీ విసినిగిరి శ్రీనివాసరావు గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జోహార్ లు ఆర్పించారు. అనంతరం అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహనీయుడిని కొనియాడారు. ఆయన సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకొని వెనుకబడిన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు. నిరంతరం అంబేద్కర్ ఆశయ సాధనకే మా పార్టీ కట్టుబడి ఉంటుందని తెలియజేశారు మా పార్టీ 7 సిద్ధాంతాలలో ఒకటి కులాలను కలిపే ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానంలో ఒకటని పొందుపరచడం జరిగిందని తెల్పారు. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు ఎచ్చర్ల లక్ష్మి నాయుడు, సిగ తవిటి నాయుడు, జనసేన శంకర్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com