అరకు ( జనస్వరం ) : అరకు నియోజకవర్గ కేంద్రం పరిధిలో గల కొత్త బల్లు గూడ పంచాయతీ కొర్రగూడ గ్రామాల్లో జనసేన మాటలు జనంలోకి తీసుకెళ్లే భాగంగా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా ( మాజీ ఎంపిటిసి ) మాదల శ్రీరాములు, జనసేన మండల అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో సందర్శించారు. ముందుగా ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిన చిన్నారి తల్లితండ్రులకు పరామర్శించారు. అనంతరం జనసేన మాటలు, జనసేన సిద్ధాంతాలు ఇంటింటికి వెళ్లి జనంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆయా గ్రామంలో రోడ్డు సమస్య ఇబ్బంది కరంగా ఉందని, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తామని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, నేటి వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నట్టు జనసేన బృందం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ తక్షణమే గిరిజనుల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరించాలని, గిరిజన కుటుంబాలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఇళ్ల పట్ల ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి గిరిజనులకు కనీస మౌలిక సదుపాయం కల్పించగలరని, ఈ సందర్భంగా గిరిజనులు తరపున జనసేన పార్టీ ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుందని చెప్పారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com