
విశాఖపట్నం, (జనస్వరం) : ఉత్తరాంధ్రా మత్యకార తీర ప్రాంతాలాల్లో ఈనెల 25,26,27 తేదీల్లో మత్యకార వికాస విభాగం పర్యటనలో భాగంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ పర్యటన కొనసాగుతుంది. మొదటి రోజు పర్యటనలో భాగంగా విశాఖ తీరప్రాంతమైన మత్యసంపదపై ఆధారపడిన చిరు వ్యాపారులను కలసి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ బోట్ బోనర్న్స్ వారు వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తదుపరి గంగవరం ఫిషింగ్ హార్బర్ నిలిపివేత కారణంగా ఎంతో మంది జీవనోపాధి కోల్పోయామని సంబధిత మత్యకారులు వారి సమస్యలను జనసేన రాష్ట్ర మత్యకార వికాస విభాగం వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారి సమస్యలన్నీ జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వారి సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. మత్యకార తీరప్రాంత ప్రజల్లో జనసేనపార్టీకి విశేష స్పందన వస్తుంది. ఎన్నడూ లేని విధంగా పార్టీ పట్ల వారి ఆదరణ, అభిమానం, ఆసక్తి మత్యకారుల్లో చూసాము. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుందని, వారిని ఆదరించి ఓటు వేసినందుకు మేము చాలా నష్టపోయామని వాపోయారు. ఈ పర్యటనలో రాష్ట్ర మత్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్, రాష్ట్ర కార్యదర్శి కంబాల దాసుబాబు, గంటసాల వెంకటలక్ష్మి, జనసేనపార్టీ మత్యకార ముఖ్య నాయకులు పల్లేటి బాపనదొర, B.కుమార్ మరియు రాష్ట్ర మత్యకార కార్యవర్గ సభ్యులు జనసేనపార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.