
● జనసేన పార్టీలో రూ. 500 పార్టీ సభ్యత్వం చెల్లిస్తే 5 లక్షలు బీమా
● ప్రమాదంలో గాయపడితే 50 వేలు ఆర్థిక సాయం.
● సోమవారంతో ముగియనున్న సభ్యత్వ నమోదు.
వీరఘట్టం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గo, వీరఘట్టం మండలం, విక్రమపురం గ్రామంలో జనసేన నాయకులు జనసేన పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే పార్టీ కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు బీమా, 50 వేల రూపాయలు ప్రమాద పరిహారం వస్తుందని పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ వీరఘట్టం మండలం జనసేన పార్టీ నాయకులు మత్స.పుండరీకం, వావిలపల్లి నాగభూషణం వెల్లడించారు. శనివారం విక్రమపురం గ్రామంలో విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం 500 రూపాయలు చెల్లిస్తే ఈ సదుపాయాలు వర్తిస్తాయని ఆయన వివరించారు. జనసేన పార్టీ కార్యకర్తలను వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పథకం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. సోమవారం సాయంత్రం వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి చివరి గడువు అన్నారు. క్రియాశీలక సభ్యత్వ నమోదు పూర్తి వివరాలకు 9441062293 ఈ నంబరుకు సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.