
పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండల కేంద్రంలో జనసేన పార్టీ నాయకులు మత్స్యకార కుటుంబాలను కలిసి వాళ్ల యొక్క సమస్యలను తెలుసుకున్నారు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మత్స్యకార అభ్యున్నతి సభ యొక్క ముఖ్య ఉద్దేశం వివరించి, పార్టీ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ మీద అవగాహన కల్పించారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కారమై అంతవరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ వీరఘట్టం మండల నాయకులు మాట్లాడుతూ మత్స్యకార సమస్యలను తీరుస్తానని నేరుగా పాదయాత్రలో హామీలు కురిపించిన CM జగన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వీర గొట్టం మండలం జనసేన నాయకులు మత్స.పుండరీకం, వజ్రగడ రవికుమార్, గర్భాపు నరేంద్ర , కోడి వెంకటరమణ, కార్యకర్తలు, మత్స్యకార కుటుంబాలు పాల్గొన్నాయి.