Logo
Date of Publish : 10 September 2023, 6:35 pm
Editor : Sake Naresh

ఉప్పు కాలువ బ్రిడ్జిని సందర్శించిన సర్వేపల్లి జనసేన నాయకులు

     సర్వేపల్లి ( జనస్వరం ) : బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ తిరుమలమ్మపాలెం ఉప్పుకాలువపై హై లెవెల్ వంతెనకి మోక్షం ఎప్పుడు కలుగుతుందో. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు వస్తున్నారు, పోతున్నారని జనసేన నాయకులు అన్నారు. వరదలు వస్తున్నాయి, రాకపోకలు ఆగిపోతున్నాయి. కానీ వరదలు సమయాలలో తిరుమలమ్మపాలెం గ్రామ ప్రజలు పడే అవస్థలు, ఇబ్బందులు, వారి కష్టాలు నాయకులకు పట్టవు. ఎనిమిది నెలలు అయింది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రూ.13 కోట్ల రూపాయల నిధులతో హై లెవెల్ వంతెన నిర్మాణం చేస్తా అని చెప్పి ఇప్పటివరకు కనీసం శిలాఫలకం వేసిన పరిస్థితి కూడా లేదు. గత ప్రభుత్వంలో శిలాఫలకం వేశారు. రూ.తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మిస్తామని చెప్పారు. మరి ఆ తొమ్మిది కోట్ల ఎటు పోయినాయి. ఆ శిలాపాలకం ఎటు పోయిందో తెలీదు. మళ్ళీ ఈయన రూ.13 కోట్ల రూపాయలతో నిర్మిస్తామని చెప్పాడు. కనీసం శిలాఫలకం కూడా వేసిన దాఖలాలు లేవు. ఈయన వాగ్దానాలు, మాటలు గారడి ఎలా ఉందంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. వాగ్దానాలు, మాటలకి తప్ప చేతల్లో చేసే పరిస్థితి లేదు. తిరుమలమ్మపాలెం గ్రామానికి కలగా ఉన్న హై లెవెల్ వంతెన నిర్మాణం ఒక జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరుగుతుంది. వీళ్ళు ఎవరు కూడా చేయరు. ఇకనైనా కళ్ళు తెరవండి తిరుమలమ్మపాలెం గ్రామ ప్రజలారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీహరి, విజయ్, శ్యాంసుందర్, సుమంత్, విజయకుమార్, సుమన్ ,వెంకటేష్, వంశి, సాయి ,తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com