సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నందు సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అండదండలతో పెట్రేగిపోతున్న గ్రావెల్ మాఫియా కారణంగా ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. గ్రావెల్ మాఫియాను అరికట్టేది ఎవరు ప్రభుత్వ అధికారులా, గనుల శాఖ లేదా, రెవెన్యూ శాఖనా ఎవరు కూడా పూర్తిస్థాయిలో అరికట్టాలన్న ఆలోచన కూడా చేయలేకపోవడం బాధాకరం. అదే విధంగా ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారా, లేదంటే ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా, లేదంటే సహజ వనరులని కాపాడాల్సిన బాధ్యత అధికారుల పై లేదా, ఇరిగేషన్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. అంటే దీనికి కారణం. గ్రావెల్ మాఫియా పై ఉక్కు పాదం మోపలేరా. నిన్న ఆదివారం ఆరవ తారీకు సాయంత్రం 6 గంటలపైన వెంకటాచలంలోని కనుపూరు చెరువులో గత కొంతకాలంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ టిప్పర్లు హైవే మీదకు దూసుకుని వస్తూ దుమ్ము దులితో కనీసం హైవే మీద రోడ్డు కూడా కనిపించని విధంగా టిప్పర్లు వేగంగా రావడం ఆ దుమ్ముతో రోడ్డు కనపడక ఏదైతే ఎస్బిఐ బ్యాంక్ యాజమాన్యం తిరుపతి నుంచి కావలికి వెళ్లే టెంపో టిప్పర్ తగిలి ఒకరి ప్రాణాన్ని బలిగొనడం. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడం దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. గనుల శాఖనా లేక మంత్రి లేక ప్రభుత్వ అధికారులా ఎవరు అన్నది ప్రజలకు చెప్పండి. గ్రావెల్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న వీళ్ళందరూ ఎవరు బాధ్యత వహిస్తారు. ఇకనైనా కళ్ళు తెరవండి గ్రావెల్ మాఫియా పై ఉక్కు పాదం మోపండి. మీరు గ్రావిల్ మాఫియాని అరికట్టకుంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము పోరాటం చేసేందుకు వెనకాడమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, ఖాజా, రహీం తదితరులు పాల్గొన్నారు.