ప్రకాశం, (జనస్వరం) : జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శ్రీ షేక్ రియాజ్ గారి అదేశల మేరకు 10వ డివిజన్ రాణమ్మ కాలనీలో “ప్రజారోగ్యం – ప్రభుత్వ భాద్యత” అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒకవైపు కరోనా, మరోవైపు దోమల దాడి ఎక్కువగా ఉంటే కనీసం ఈ కాలనీలో పారిశుధ్యం అగమ్యగోచరంగా ఉంది. కనీసం రోడ్లు, కాలువలు కూడా లేకపోవడం చాలా బాధకరం. వర్షాలు ఎక్కువగా పడితే కాలనీలో ప్రజలు నివశించే పరిస్థితి లేదు. ఇక్కడి ప్రజలు ఎన్నో సార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకోని వెళ్ళిన ఫలితం లేదన్నారు. గతంలో ఈ కాలనీలో వీధి దీపాలు లేనప్పుడు ” జనసేన పార్టీ ” అధ్వర్యంలో సొంత నిధులతో విద్యుత్ లైన్ వేయించడం జరిగింది. ఇక్కడి ప్రజలకు సంబంధించిన వరకు ప్రభుత్వం నుండి రావలసిన ఏ విధమైన సంక్షేమ పధకాలు వీరికి రాకపోవడం చాలా విచారకరం. కనీసం వీరికి ప్రభుత్వం వాలంటీర్ ను కుడా కేటాయించ లేకపోవడం అత్యంత దారుణమైన పరిస్థితి. దోమల తీవ్రతను తగ్గించేందుకు జనసేన పార్టీ నాయకులు ఇక్కడ ప్రజలకు కరోనా, డెంగ్యూ, మలేరియా గురించి అవగాహన కల్పించి, తదుపరి కాలనీలో బ్లీచింగ్ చల్లి పారిశుధ్యం పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని రాణమ్మ కాలనీలో చేయాలని నిర్ణయించిన జనసేన జిల్లా అధ్యక్షుడు శ్రీ షేక్ రియాజ్ గారికి కాలనీ వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండారు సురేష్, ఈదుపల్లి గిరి, పోకలనరేంద్ర, ch. సుధాకర్, శంకర్, టంగుటూరి శ్రీను, శివప్రసాద్, శివ వీరమహిళలు, ప్రమీల, కోమలి తదితరులు పాల్గొన్నారు.