పత్తికొండ ( జనస్వరం ) : పత్తికొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు C. రాజశేఖర్ మద్దికేర గ్రామంలో పర్యటించడం జరిగింది. గ్రామంలో పలు సమస్యలు తెలుసుకొని, స్థానికంగా మద్దికేర ఎం పి డి ఓ గారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ముఖ్యంగా రాంనగర్ వీధిలో సిసి రోడ్లు మురికి నీటి కాలువల వసతి లేక వర్షాల కారణంగా మురికి నీరు, వర్షపు నీరు రోడ్డుపైకి రావడం వలన కాలనీవాసులు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు. వర్షం నీటితో రోడ్డంతా బురదమయంగా మారుతోందని, కాలనీవాసులు వాహనాలు నడపడానికి కాలినడకన వెళ్లే వారికి చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు. బైకులు స్కిట్ అయ్యి గుంతలో పడి దెబ్బలు తగులుతున్నాయి. కాలనీవాసులు మాట్లాడుతూ అధికారులకు తెలిపినా ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో రామ్ నగర్ కాలనీ వాసులతో కలిసి ధర్నాలు చేయాల్సి వస్తుందని తెలియజేశారు. అధికారుల వైఖరి ఎలా ఉంది అంటే, కేవలం మట్టితో పైపైన వేసి రోడ్లను అలంకారంగా మార్చారని గ్రామవాసులు కాలనీవాసులు బాధను వ్యక్తం చేశారు. ఈ సమస్యను 15 రోజుల లోపల పరిష్కరించకపోతే మేము రోడ్లమీద కూర్చుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, అశోక్, అజయ్, రాజు, యుగంధర్, గోపి, మనోహర్, తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com