Logo
Date of Publish : 12 July 2022, 4:07 pm
Editor : Sake Naresh

మున్సిపల్ కార్మికులకు అండగా నెల్లూరు జిల్లా జనసేన నాయకులు

      నెల్లూరు, (జనస్వరం) : మున్సిపల్ కార్మికుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యేంతవరకు జనసేన పార్టీ వారికి అండగా నిలుస్తుందని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మంగళవారం జనసేన పార్టీ మద్దతు తెలుపుతూ వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని,  సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నేడు వారిని మోసం చేయడం దారుణమన్నారు. పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటు, పాత బకాయిలను చెల్లించి, హెల్త్ అలవెన్స్లు కొనసాగించాలని, పనిముట్లు, పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. మంత్రులు మారితే కార్మికుల జీతాలు తగ్గడం వైసీపీ ప్రభుత్వ హయంలో చూస్తున్నామన్నారు. ఆదివారం భీమవరంలో జరగనున్న జనసేన జనవాణి కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకువెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ఐటీ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు స్వరూప్, నాయకులు పారిచర్ల భాస్కర్, రాజా, ఇంద్రవర్ధన్, కుమార్, శ్రీనాథ్, సంతోష్, రాజేష్, శివ, సూర్య, సనత్, అవినాష్, సాయి, శంకర్, మోహన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com