Logo
Date of Publish : 28 July 2022, 4:04 pm
Editor : Sake Naresh

ఉపాధ్యాయులపై బొత్స చేసిన వ్యాఖ్యలను ఖండించిన మదనపల్లె జనసేన నాయకులు

     మదనపల్లె, (జనస్వరం) : విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయుల పైన దురుద్దేశంతో చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు చేతకాని హామీలు ఇచ్చి, నెరవేర్చలేక ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యంగా ఉపాధ్యాయులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే దురుద్దేశంతో అవినీతి యాప్ రూపొందించి 14400 కాల్ సెంటర్ పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాజకీయ నాయకులు అవినీతి చేస్తే ఏ కాల్ సెంటర్కు ఫోన్ చేయాలి?ప్రభుత్వ స్కూల్లకు బుక్కులు సప్లై చేయలేక, ప్రభుత్వం హామీ ఇచ్చిన కిట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమకూర్చలేక, ప్రతి జిల్లాలో DEOల ద్వారా హెడ్మాస్టర్లకు వీడియో కాల్ చేయించి ఎవరైనా అడిగితే బుక్కులన్నీ సప్లై చేసినం, కిట్లన్నీ ఇచ్చినామని చెప్పాలి లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. ఈ విషయాలు ఉపాధ్యాయులు బయటబెడతారని దురుద్దేశంతో రోజు ఉపాధ్యాయుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఉపాధ్యాయుల్ని ప్రజల్లో చులకన చేసే దురుద్దేశంతో ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. దీనిని జనసేన తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జనసేన నాయకులు దారం హరిప్రసాద్, రెడ్డి, గిడ్డు, సాబు, ప్రసన్న, మురళి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com