
జగ్గయ్యపేట, (జనస్వరం) : జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం ఉపాధ్యక్షుడు తన్నీరు గోపీనాథ్ కి నిన్న రాత్రి మైలవరం నుండి పెనుగంచిప్రోలు వస్తుండగా మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శిలు రవి, సురేష్, పెనుగంచిప్రోలు మండల అధ్యక్షులు శివ విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్ వచ్చి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వారి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది.