Logo
Date of Publish : 23 January 2021, 3:56 pm
Editor : Sake Naresh

దెందులూరు నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీమతి గంటసాల వెంకటలక్ష్మి గారిపైదాడి అప్రజాస్వామికం

               దెందులూరు : పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కొమరేపల్లి గ్రామంలో వింత వ్యాధితో ప్రజలు బాధపడుతుంటే వారిని పరామర్శించేందుకు వెళ్లిన మా జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి ఘంటసాల వెంకట లక్ష్మి గారిపై వైసిపి నాయకులు దాడికి పాల్పడటం అప్ర జాస్వామికం. ఇందుకు పోలీసులు అండగా ఉండటం దురదృష్టకరం. సమస్య ఉన్న చోట బాధితుల పక్షాన నిలబడి మాట్లాడటం ప్రతిపక్షంగా మా బాధ్యత. అందుకు అనుగుణంగా మా జనసేన పార్టీ ప్రతినిధిగా శ్రీమతి వెంకట లక్ష్మి గారు అక్కడకు వెళితే అధికార పార్టీ నాయకులు, పోలీసులు ఎందుకు కంగారు పడ్డారు? ప్రభుత్వ వైఫల్యాలు, పాలనాపరమైన లోపాలు కప్పి పుచ్చుకునేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. బాధితులను పరామర్శించాలన్నా, ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడాలన్నా మెడలో ఉన్న జనసేన పార్టీ కండువాను తీసివేయాలని అనడం, అంగీకరించనందుకు శ్రీమతి వెంకట లక్ష్మి గారిని అనుచితంగా పక్కకు నెట్టి వేయడం, పోలీసులు అందుకు సహకరించడం అభ్యంతరకరం. పోలీసులు మహిళల పట్ల సున్నితంగా వ్యవహరిందాలి. శ్రీమతి వెంకట లక్ష్మి గారిని అనుచితంగా పక్కకు నెట్టి వేయడం, పోలీసులు అందుకు సహకరించడం అభ్యంతరకరం పోలీసులు మహిళల పట్ల సున్నితంగా వ్యవహరించాలి. ఈ విషయాన్ని కూడా విస్మరించి, బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మా పార్టీ నాయకురాలు పట్ల మొరటుగా వ్యవహరించారు. అధికారంలోకి పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. వ్యవస్థలు శాశ్వతంగా, పటిష్టంగా ఉండాలి. అంతేతప్ప అధికారంలో ఉన్న వారి కోసమే పని చేస్తాము అనే విధంగా కొందరు పోలీసులు, అధికారులు వ్యవహరిస్తున్నారు.అధికార పార్టీ వాళ్లు జనసేన కండువా పక్కన పెట్టాలని దాడికి పాల్పడ్డారు అంటే ఈ ప్రభుత్వానికి జనసేన జెండా, కండువా అంటే భయం అని అర్ధం అవుతోంది. శ్రీమతి వెంకట లక్ష్మి గారిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, అధికార పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారని సమాచారం తెలిసిన వెంటనే మా అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు. పరిస్థితిపై సమీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నాయకులు శ్రీమతి వెంకట లక్ష్మి గారితో మాట్లాడి ధైర్యం చెప్పవలసిందిగా, ఈ విధమైన చర్యలకు పాల్పడటంపై జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదు చేయవలసిందిగా ఆదేశించారు. శ్రీమతి వెంకట లక్ష్మి గారికి, వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని నాదెండ్ల మనోహర్ గారు అన్నారు .


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com