Logo
Date of Publish : 02 May 2022, 5:27 pm
Editor : Sake Naresh

పేద ముస్లిం మహిళ గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించిన చిత్తూరు జిల్లా జనసేన నాయకులు

    చంద్రగిరి, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో చంద్రగిరి నియోజవర్గం దామలచెరువు పంచాయతీలో జిల్లా కార్యదర్శి నాజీర్ భాష, పాకాల మండలం అధ్యక్షులు తలారి గురునాథ్, వారి మిత్ర బృందం అధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ PAC సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో ఉండి పదవులు అధికారం అనుభవిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు సామాన్య ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. జనసేనపార్టీ అధికారంలో లేకపోయినా జనసేన పార్టీ నాయకులు సుమారు 90,000 రూపాయలు దామలచెరువు పంచాయతీలో గల మౌలాలి పేట వీధిలో నివసిస్తున్న ముస్లిం యువతి దిల్షాద్ తల్లి, తండ్రినీ కోల్పోయి గతంలో కురిసిన భారీ వర్షాలకు తనకు ఉన్న పూరి గుడిసె పూర్తిగా పడిపోవడం వల్ల ఒంటరిగా జీవనం సాగిస్తున్న మహిళలకు జనసేన పార్టీ సుమారు లక్ష పదివేల రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. జనసేనపార్టీ PAC సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరి ప్రసాద్ 20,000/- రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు రాయల్ వెంకట్  నిర్మించబోయే ఇంటికి రంగులు ఇస్తానన్నారు. చంద్రగిరి మండల అధ్యక్షులు కిషోర్ రాయల్ కరెంటు వస్తువులు ఇచ్చారు. ఆర్థిక సహాయంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక, సిమెంట్, ఇనుము వంటివి ఇంకా కావాలి అంటే సహాయం చేస్తాము అని తెలిపారు. జనసేనపార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై ముస్లిం సోదరులు అలాగే ఇతర పార్టీల నాయకులు డా.హరి ప్రసాద్ గారి అధ్వర్యంలో జనసేన కండువాలు కప్పుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో GD నెల్లూరు నియోజకవర్గం ఇంఛార్జి డా.పొన్నా యుగంధర్, జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీమతి బీగాల అరుణ, జనసేన నాయకులు నాగుర్, వెంకటేష్, షాజహాన్, రహంతుల్లా, చాంద్ భాష, నౌమున్, మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, జనసేన వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com