
వైసీపీ పార్టీ ఆగడాలకి భయపడే ప్రసక్తే లేదన్న చంద్రగిరి నియోజకవర్గం జనసేన నాయకులు కంచన శ్రీకాంత్
నివర్ తుఫాన్ వల్ల రైతుల సమస్యలు తెలుసుకొనుటకు చిత్తూర్ జిల్లాలో రెండురోజుల పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలంలోని పొయ్య గ్రామంలోని రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచ్చేసినా సందర్భంగా కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోకి రానివ్వకుండా వాహనాలను అడ్డుపెట్టి దౌర్జన్యంకు దిగి జనసేన కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని కంచన శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఒక పక్క నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయి ఆత్మహత్యలు అనేకం జరుగుతున్నాయన్నారు. దీనిని చూసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రైతులకు అండగా పర్యటన పెట్టుకుంటే ఇటువంటివి అడ్డుపెట్టి దాడులకు దిగడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. వీలైతే మీరు నష్టంపోయిన రైతులకు పరిహారం చెల్లించండి. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్నారు. మీ ఆగడాలకు జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ భయపడే ప్రసక్తేలేదు. ఇంకనైనా సరే మా నాయకుని సూచన మేరకు దెబ్బదిన్న వరిపంట ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ తరపున కంచన శ్రీకాంత్ డిమాండ్ చేసారు.