చంద్రగిరి, (జనస్వరం) : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రెడ్డివారిపల్లె ఎస్ టి కాలనీ యందు, చంద్రగిరి నియోజకవర్గం నివాసి, కంచర్ల శ్రీకాంత్ గారి పుట్టినరోజు సందర్భముగా, అతను కువైట్లో ఉద్యోగరీత్యా అక్కడే ఉన్నందున, వరదల వలన చాలా కుటుంబాలు దెబ్బతిని, ఆహార వసతులు సరిగా లేక, ఉండడానికి ఇల్లు లేక చాలా అవస్థలు పడుతున్న 40 కుటుంబాలకు నెలకు సరిపడా బియ్యము ఆహార వస్తువులు, కూరగాయలు, నగదుగా ₹100, రూపాయలు చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి సూచన మేరకు ఇక్కడికి వచ్చిన రామచంద్రనాయక్ వారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో చిత్తూరు జిల్లా జనసేన నాయకులు సీటు చింతకాయల కృష్ణ, జిల్లా జిల్లా సెక్రెటరీ శ్రీమతి బీగాల అరుణ, కలప రవి, పో టుకూరు ఆనంద్, షేక్ నజీర్, చంద్రగిరి జనసేన నాయకులు, చిన్నగొట్టిగల్లు యశ్వంత్, మురళి, సుబ్రహ్మణ్యం, పాకాల జనసేన నాయకులు, బాల గురప్ప, దామలచెరువు చరణ్, అవిలాల బాల, చంద్రగిరి నాగేంద్ర కుమార్, షేక్ బాషా, రెడ్డివారిపల్లె జనసైనికులు, మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com