ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఆత్మకూరు జనసేన పార్టీ ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటంలో భాగంగా ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారు జనసైనికులతో కలసి ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నిర్మాణంలో ఉన్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గాన్ని సందర్శించడం జరిగింది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు దశాబ్దాలుగా నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గం అన్నిరకాల దగాకి, దోపిడీకి వివక్షకు, నిర్లక్ష్యానికి గురైందని ఈ సందర్భంగా తెలియజేశారు. పారిశ్రామిక రంగంలో గాని మౌలిక వసతుల కల్పన రంగంలో కానీ, సాగునీటి విషయంలో గాని దశాబ్దాలుగా ఆత్మకూరు నియోజకవర్గానికి తీవ్రమైన అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ ప్రాంతవాసుల ఐదు దశాబ్దాల కల నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం. దశాబ్దాల పోరాట ఫలితంగా 2012 సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు లభించాయి. కానీ 2018 వరకు నిధులు మంజూరు జరగలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి రైల్వేశాఖకు అప్పగించ వలసి ఉంది. ఈ రైల్వే నిర్మాణానికి అవసరమైన ఖర్చులో సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తన వంతు నిధులను మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ జిల్లాలో ఒక ఎకరం భూసేకరణ గాని, రాష్ట్ర ప్రభుత్వం తాలూకు నిధులను కానీ మంజూరు చేయని కారణంగా 2020 సంవత్సరం లోనే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ వరకు నత్తనడకన సాగుతూ నే ఉంది. ఇప్పటికైనా పాలకులు ఈ ప్రాంత అభివృద్ధి పట్ల తమ వివక్షను విడనాడి నెల్లూరు జిల్లాలో రైల్వే నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించి రైల్వేశాఖ అప్పజెప్పాలని, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులను విడుదల చేయాలని జనసేన పార్టీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. లేనిపక్షంలో దశాబ్దాలుగా దగాపడ్డ, వివక్ష కారణంగా వెనుకకు నెట్టి వేయబడ్డ, ఈ ప్రాంత ప్రజల పక్షాన జనసేన పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారితో పాటు జనసైనికులు పాల్గొన్నారు .
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com