అనంతపురం ( జనస్వరం ) : జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా... అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో రోడ్డు శ్రమదానం చేశారు. అనంతపురం నియోజకవర్గంలో JNTU కాలేజ్ మొదటి గేట్ ముందు ఉన్న మెయిన్ రోడ్ లో అతి ప్రమాదకరమైన గుంతలు పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ప్రజలు ఇక్కట్లను గమనించి ప్రజల సౌకర్యార్థం లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారి సొంత నిధులతో రోడ్డుకు మరమ్మత్తులు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి గారి స్ఫూర్తితో... జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధనలో భాగంగా జనసేన పార్టీ తరపున సేవా కార్యక్రమం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వర్, తాడిపత్రి ఇంచార్జ్ కడపల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా IT అధ్యక్షులు శ్యాంసుందర్, అనంతపురం నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, అనంతపురం జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, పురుషోత్తం రెడ్డి, మెరుగు శ్రీనివాస్, పుట్టపర్తి IT కోఆర్డినేటర్ విష్ణువర్ధన్, ఉరవకొండ IT కోఆర్డినేటర్ సుదీర్, అనంతపురం జిల్లా IT విభాగం సభ్యులు గిరిప్రసాద్, లక్ష్మీనరసప్ప, నగర ప్రధాన కార్యదర్శి ధరాజ్ భాష, పాలగిరి చరణ్ తేజ, ఊటూరు జయకృష్ణ, భవాని నగర్ మంజునాథ్, తోట మోహన్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com