అంగన్వాడీల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన అనంతపురం జనసేన నాయకులు

    అనంతపురం ( జనస్వరం ) : అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అనంతపురము జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టి.సి.వరుణ్ మీడియా వారితో మాట్లాడుతూ… సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి ఇవ్వాలని, గత ఆరు నెలల నుండి పెండింగ్లో పెట్టిన సెంటర్ అద్దెలు, టిఏ బిల్లులు తక్షణం చెల్లించాలని, ఆయాల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచి, రాజకీయ జోక్యాన్ని నివారించాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు, ప్రమోషన్లు కల్పించాలని, ఫేస్ రికగ్నైజేషన్ యాప్ రద్దు చేయాలని కోరారు. సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బీమా అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలని కోరారు. వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఏ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల పేరుతో కాలయాపన తప్ప సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని నిధి లేని పరిస్థితుల్లో అంగన్వాడి కార్మికులు నిర్వహిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని తెలియజేశారు. నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ బటన్ నొక్కడం తప్ప అంగన్వాడీ గుండు సున్నా అన్నారు. తెలంగాణలో అంగన్వాడీలకు 13,650/- చెల్లిస్తుంటే, అదనంగా చెల్లిస్తానన్న జగనాంధ్రప్రదేశ్లో 11500/- చెల్లిస్తూ, ఆయమ్మకు 7వేలు మాత్రమే చెల్లిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలనుండి జగన్ ప్రభుత్వం దూరం పెట్టిందని, జీతాలు చెల్లించేటప్పుడు మాత్రం మీకు ప్రభుత్వానికి సంబంధం లేదంటూ వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, జనసైనికులు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way