అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనంతపురం రూరల్ మండలం హమాలిని కాలనీ, ఆదర్శనగర్, జాకీర్ కొటాల్, దండోరా కాలనీలలో వరద పరిస్థితిని సమీక్షిస్తూ వరద బాధితులను జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్, రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జ్ సాకే పవన్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భవాని రవి కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియా ముఖంగా చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాజకీయాలను పక్కన పెట్టి వరద బాధితులకు తక్షణ సాయంగా రూ 10,000/-రూపాయలు ఆర్థికసాయం, ఆహార పదార్థాలు అందించి పునరావాస కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ కాలనీలు జలమయం కావడానికి ప్రధాన కారణం అని మండిపడ్డారు. ఎలక్షన్ ముందు ప్రజలకి అది చేస్తాం ఇది చేస్తాం అని నమ్మబలికి గెలిచాక ఇంతలా ఇబ్బంది ప్రజలు పడుతున్న పట్టించుకున్న పాపానపోలేదు. అలాగే ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి వచ్చే జనసేన కార్యకర్తలపై అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు సహాయం చేయనీకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈశ్వర్, నాగేంద్ర, విజయ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే కార్యక్రమముల నిర్వాహక సభ్యులు మధు, వెంకటేష్ మండల అధ్యక్షులు రామాంజనేయులు, సంయుక్త కార్యదర్శి కోడిమి నారాయణస్వామి, జనసేన పార్టీమండల నాయకులు వెంకటేష్, నవీన్, రమేష్, బాబు, సదా, ముస్తఫ, రాయల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.