ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలం, సింగన్న పాలెం గ్రామానికి చెందిన సూరపు అప్పమ్మ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమదాలవలస నియోజకవర్గం నాయకులు కొత్తకోట నాగేంద్ర ఆధ్వర్యంలో, కొల్ల జయరామ్, ఎంపిటిసి విక్రమ్, కోరుకొండ మల్లేశ్వర రావు, తులగాపు మౌలీ, R జగ్గారావు, T శ్రీనివాస్ మాస్టారు, Pయోగి, K నరేష్,T తిరుపతి, గేదెల వాసు, సంగం నాయుడు, S రమేష్, R అనంత్ మరియు జనసైనికులు, ఊరు పెద్దలు, యువత సహకారంతో తమవంతు సహాయంగా రూ.10 వేల నగదును, 6 బ్యాగ్ సిమెంట్ అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పార్టీ పరంగా ఇంటి నిర్మాణానికి కృషి చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.