ఆత్మకూరు, (జనస్వరం) : నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త కానగుల శ్రీనివాసులు తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారు జనసైనికులతో కలసి అనంతసాగరం మండలం మంగుపల్లి గ్రామంలోని శ్రీనివాసులు స్వగృహములో కలసి పరామర్శించడం జరిగింది. అనంతరం ఆత్మకూరు జనసేన పార్టీ తరపున అతనికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా, జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం తరఫున 50 వేల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కు సంబంధించిన పత్రములు అందజేసి వీలైనంత త్వరగా ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చూస్తాం అని భరోసా ఇవ్వడం జరిగింది.