అనంతసాగరం చెరువు ప్రధాన అలుగు ఎత్తు తగ్గించాలని రైతులతో కలిసి డి.ఆర్.ఓ గారికి వినతిపత్రం ఇచ్చిన జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్

   అనంతసాగరం, (జనస్వరం) :  అనంతసాగరం మండలంలోని గోవిందంపల్లి, మంగుపల్లి, పాతాళ పల్లి, ముస్తాపురం, కామిరెడ్డిపాడు, చిలకలమర్రి, గౌరవరం గ్రామాలకు చెందిన పంటపొలాల ముంపునకు కారణమైన, అనంతసాగరం చెరువు ప్రధాన అలుగు ఎత్తు తగ్గించాలని అందుకు వీలుకాని పక్షంలో ముంపుకు గురైన పొలాలకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని స్థానిక గ్రామ సర్పంచులు, అఖిలపక్ష నాయకులు మరియు రైతు సోదరులతో కలసి ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో డి.ఆర్.ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు గ్రామాలకు చెందిన పంట పొలాలు ముంపునకు గురయ్యాయని పేర్కొనడం జరిగింది. ఈ ముంపునకు ప్రధాన కారణం అనంతసాగరం చెరువు అలుగును మూడు, నాలుగు అడుగుల మేర ఎత్తు పెంచడమే అని జిల్లా అధికారులకు విన్నవించడం జరిగింది. 1521వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీ కృష్ణ దేవరాయలు ఈ చెరువును నిర్మించారు. గత ఆరు వందల సంవత్సరాలుగా మెట్ట ప్రాంతమైన అనంతసాగరానికి సాగు, తాగునీటికి ఆధారంగా ఈ చెరువు నిలిచిందని పేర్కొన్నారు. గడచిన ఆరు వందల సంవత్సరాల కాలంలో ఏనాడు ఈ చెరువుకు పూడిక తీసింది లేదు. పూడిక తీయకుండానే ఈ చెరువు యొక్క నీటి నిల్వ సామర్థ్యం పెంచాలన్న ఉద్దేశంతో, ప్రస్తుత పాలకుల అవగాహనా లోపం కారణంగా ఈ చెరువు అలుగు ఎత్తు పెంచడం ద్వారా, మండలంలోని ఏడు గ్రామాలకు చెందిన పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, సర్వే జరిపించడం ద్వారా ఈ పంట పొలాలు ముంపునకు కారణాలపై ఒక నివేదిక రూపొందించాలని జనసేన పార్టీ తరఫున జిల్లా అధికారులను కోరడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా, చెరువు అలుగు ఎత్తు తగ్గించడమా, లేకపోతే ముంపునకు గురైన పొలాలకు తగిన నష్టపరిహారం చెల్లించడమా, ఏదో ఒక నిర్ణయానికి వచ్చి రైతులకు న్యాయం చేకూర్చాలని, జనసేన పార్టీ తరఫున కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way