నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130 వ జన్మదిన సందర్భంగా దువ్వూరు గ్రామంలోని, ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు, జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలక, బలపం, వాటర్ బాటిల్స్, పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. దువ్వూరు జనసైనికులు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మరియు నియోజకవర్గ జనసైనికులు మరియు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శం అయిందన్నారు. ప్రస్తుతం ఆయన రాసిన రాజ్యాంగానికి విలువ ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్ గారి చిత్రా పటలాకు అవమానం జరగడం చూశామన్నారు. ఇకనైనా ప్రభుత్వాలు మేలుకొని అంబేద్కర్ గారిని గౌరవించుకొని చైతన్యవంత కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, జనసేన నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.