రైల్వే కోడూరు, (జనస్వరం) : రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలంలో రాళ్ళచేరువుపల్లే నందు "జీవన జ్యోతి ఆనంద నిలయ అనాథ వృద్ద ఆశ్రమం" నందు జనసేన దళిత నాయకులు నగిరిపాటి మహేష్ వృద్ధులకు ఉచిత వైద్య శిబిరంను ఏర్పాటు చేసి స్వయాన వారికి ప్రాధమిక వైద్య సహాయంను అందించడం జరిగినది. వారు మా పట్ల చూపిన అభిమానం, వారికళ్ళల్లో అనందం మాకి చాలా భావోద్వేగానికి గురిచేసిందని, ఈ ఆశ్రమాన్ని స్థాపించడానికి అంగవైకల్యం అనేది పాణ్యం సుబ్రమణ్యం వ్యక్తిత్వం ముందు చిన్నబోయి, విధిని సైతం లెక్కచేయకుండా ఆదర్శవంతంగా ఆశ్రమాన్ని నడిపిస్తున్నారని తెలియజేశారు. ఇక్కడ వృద్దులు వారి మనవళ్ళు మనవరాళ్లును ఎత్తుకొని ఆడించుకొనే వయసులో అనాధ జీవిగా జీవచ్చంగా కన్న పేగుకి దూరంగా జీవిస్తున్నారు. ఇలాంటి వారిని తమ స్వంత తల్లిదండ్రులుగా ఆశ్రయం కల్పించి అండగా ఉన్న పా ణ్యం సుబ్రమణ్యంకి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక దళిత సోదరులు సహాయంగా నిలిచారు. ఈ వృద్ధాశ్రమంను వెలుగులోకి తెచ్చిన మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com