Logo
Date of Publish : 02 March 2022, 4:35 pm
Editor : Sake Naresh

జనసైనికుల సంక్షేమమే జనసేన అధినేత ధ్యేయం : జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)

     విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్ద బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ చరిత్రలోనే కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచించి పార్టీ క్రియాశీలక సభ్యులకు జీవిత భీమా సౌకర్యాన్ని కల్పించారని, ఈ అవకాశాన్ని ప్రతీ జనసైనుకులు, వీరమహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేవలం ఐదు వందల రూపాయలు పెట్టి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నచో ఐదు లక్షలు జీవిత భీమా, అలాగే ఏభైవేలు వరకు హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం ప్రమాదభీమాను పార్టీ కల్పిస్తుందని అన్నారు. విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆదేశాలు మేరకు ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ శిబిరానికి మంచి స్పందన లభించిందని, ఇదేస్ఫూర్తితో మరిన్ని శిబిరాలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. పలువురు సభ్యత్వాలు తీసుకున్న ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు మజ్జి శివశంకర్, డాక్టర్ మురళి మోహన్, చెల్లూరి ముత్యాల నాయుడు, లోపింటి కళ్యాణ్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, అబ్బు, సత్యనారాయణ, రాంబాబు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com