రాయచోటి ( జనస్వరం ) : అయ్యప్ప స్వామి గుడి ఆవరణంలోని టాయిలెట్స్ నిర్మాణానికి ఆర్థిక సహాయంగా సిమెంట్ బ్యాగ్స్ ను జనసేన పార్టీ సమన్వయకర్త మయాన మహమ్మద్ అలీ ఖాన్ అందజేశారు. అయ్యప్ప స్వామి దేవస్థానం ఆవరణంలోని టాయిలెట్స్ నిర్మాణానికి మయాన మహమ్మద్ అలీ ఖాన్ ని ఆర్థిక సహాయం చేయమని కోరగా ఆయన వంతుగా టాయిలెట్స్ నిర్మాణానికి అయ్యే సిమెంట్ బ్యాగ్స్ అందజేశారు. మహమ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ దైవానుగ్రహంతోనే దేవాలయ నిర్మాణంలో తనవంతు సహాయంగా అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. అందరికి అయ్యప్ప స్వామి అనుగ్రహం సిద్దించాలని ఆకాంక్షించారు. ఆలయ అధ్యక్షుడు బసిరెడ్డి, ట్రెజరీ మల్లన్న, ఏసీ నెంబర్ సురేష్ నాయుడు,జనసేన పార్టీ నాయకులు NRI బుడ్డ నాగభూషణం, జయరాం చిన్నారి, రాజు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.