
పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, చలివేంద్రి గ్రామం బి.సి కాలనిలో జనసేన పార్టీ నాయకులు మత్స పుండరీకం ఇంటి ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ మేనిఫెస్టో గురించి మహిళలకు, యువతకు, పెద్దలకు తెలియజేసారు. జనం వద్దకు జనసేన అనే కార్యక్రమాన్ని చలివేంద్రి గ్రామంలో ప్రారంభించారు. ప్రజలు దగ్గరకు వెళ్ళి పలు కుటుంబాలను పలకరిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా 3000 మంది కౌలు రైతులు చనిపోయారని, వాళ్ల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. అలాంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్ను కోవాల్సిన అవసరం ఉందని మత్స పుండరీకం అన్నారు. జనసేన పార్టీ గురించి వివరించి వాళ్లకు అవగాహన కల్పించారు. అలాగే వృద్దులతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే, జనసేన పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని ప్రజలను కోరారు. జనం వద్దకు జనసేన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి జనసేన పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తోందని అన్నారు. ప్రతి జనసైనికుడు మీ మీ గ్రామంలో రోజుకి ఒక గంట – ప్రజలకు జనసేన పార్టీ గురించి తెలియజేయండి అని జనసైనికులకు మత్స పుండరీకం కోరారు. ఈ కార్యక్రమంలో చలివేంద్రి గ్రామ జనసైనికులు దత్తి గోపాలకృష్ణ, బొత్స.సింహచలం, బొత్స.శ్రీనివాస రావు, గర్బన రాంబాబు, కర్ణేన పవన్ సాయి, బి.పి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.