
గజపతినగరం, (జనస్వరం) : పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రపు సురేష్ బోడసింగపేటలో ఇంటింటికి కరపత్రాలు పంచడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టాక ఆయన ప్రజా సంక్షేమ పాలన ఏవిధంగా ఉంటుందో ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యతిరేక పాలన గురించి ప్రజలకి వివరించి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు మిడతాన రవికుమార్ రామచంద్ర, రమేష్, రవి, దనింజయ్, ఆనంద్, రాజు, పండు, శ్రీను, హరీష్ తదితరులు పాల్గొన్నారు.