Logo
Date of Publish : 01 March 2023, 3:31 pm
Editor : Sake Naresh

అన్నమయ్య డ్యామ్ వరద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు మలిశెట్టి వెంకట రమణ

           రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో చెయ్యేరు వరద బాధితునికి రాజంపేట అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జీ మలిశెట్టి వెంకట రమణ ఆర్థిక సహకారంతో జనసేన ప్రతినిధులు, చెయ్యేరు వరద బాధిత కుటుంబానికి పోషణ కోసం 20 వేల రూపాయలు, ఇంటి నిర్మాణం 75 వేలు అందజేశారు. ఈ సందర్భంగా..2021 సెప్టెంబర్ నెలలో చెయ్యేరుకు వరద పోటెత్తడంతో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. పరివాహక ప్రాంతాలు, అపార ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఇందులో శివారెడ్డి అనే బాధితుడు ఇండ్లు, పశువులు, భూమి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాడు. కొడుకు, కూతురుతో కలిసి చిన్న తాత్కాలిక ప్లాస్టిక్ పట్టల ఇంటిలో జీవనం గడిపేవాడు. అధికార పార్టీ నేతలను,అ ధికారులను అందరిని కలిసినా ఎవరూ సహాయం చేయక పోవడంతో రాజంపేట జనసేన ఇంచార్జీ మలిశెట్టి వెంకట రమణ నేనున్నాను అనే భరోసా వచ్చి సహాయం అందించారు. ఇందులో భాగంగా కుటుంబ పోషణ కోసం గతంలో 25 వేల రూపాయలు ఇవ్వగా, ఇంటి నిర్మాణం కోసం 75 వేలు బుధవారం మలిశెట్టి వెంకట రమణ రాయల్ ప్రతినిధులు అందజేశారు. గతంలో 25 వేలు మరోసారి 75 వేలు ఆర్థిక సహాయం ఇవ్వడంపై బాధిత కుటుంబం హర్షం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయ కులు భాస్కర పంతులు, చెక్ డ్యామ్ వెంకటయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com