প্রিন্ট এর তারিখঃ নভেম্বর ২৫, ২০২৪, ১১:৫১ এ.এম || প্রকাশের তারিখঃ সেপ্টেম্বর ২১, ২০২০, ৭:৫৮ এ.এম
పవన్ కళ్యాణ్ గారిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు చేసిన వారిపై ఉరవకొండ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు
పవన్ కళ్యాణ్ గారిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు చేసిన వారిపై ఉరవకొండ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు
ఈ మధ్య కాలంలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలు వాడటం అలవాటు చేసుకున్నారు. అయితే కొందరు అధికార, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను మార్ఫ్ చేసి అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం చూస్తున్నాం. ఈ మధ్య మరి విచ్చలవిడితనంతో పోస్టులు పెట్టడం అలవాటుగా పరిపాటు అయింది. కొందరు అలాంటి సామాజిక ఖాతాలను అంతర్జాలంలో సంబంధించిన సైబర్ డిపార్ట్ మెంట్ లకు పలు మార్లు ఫిర్యాదులు చేసినా, పోలీసుల నుండి ఎటువంటి స్పందన లేదు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా ఉరవకొండ స్థానిక జనసేన నాయకుడు చంద్రశేఖర్ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మరియు జనసేన పార్టీ మీద అసభ్యకరంగా మాట్లాడిన, మార్ఫ్ ఫోటోలు చేసిన ఖాతాలను సేకరించి, పూర్తి ఆధారాలతో స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి చీడ పురుగుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్సై గారిని కోరారు. వారు సానుకూలంగా స్పందించారు. జనసేన నాయకుడు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పై సామాజిక మాధ్యమాలలో అసభ్యకరంగా వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకొని పోస్టులు పెడుతూ, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను మార్ఫింగ్ చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలుమార్లు పోలీసు అధికారులను విన్నవించినా స్పందన కరువు అయిందని అన్నారు. పోలీసులు కూడా అన్ని పార్టీల వారిని సమానంగా చూస్తూ తగిన పరిష్కారం చేయాలని, ఒక పార్టీ కోసం కొమ్ము కాయడం సరి కాదు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు చంద్రశేఖర్, మహేందర్ దేవేంద్ర కుమార్, సత్తార్, తదితరులు పాల్గొన్నారు.