
విశాఖపట్నం (జనస్వరం): జనసేన పీ.ఏ.సీ. సభ్యులు కొణిదెల నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఇంచార్జి డా. పంచకర్ల సందీప్, భీమిలి నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో నాయకులను నాగబాబు పార్టీ కండువాలతో సత్కరించి పార్టీలోకి ఆహ్వానించారు.