Search
Close this search box.
Search
Close this search box.

ప్రభుత్వ ఉద్యోగులుపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన జనసేన నాయకులు జయరాం రెడ్డి

       అనంతపురం, (జనస్వరం) : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పైన జరుగుతున్న దాడులను జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి సంబంధించిన సామాజిక వర్గం అన్ని శాఖల్లో పెత్తనం చెలాయిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన ఉద్యోగుల పైన వివక్ష చూపిస్తూ, BC,ST,SC మైనారిటీ ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. నంద్యాలలో అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన వన్ టౌన్ CI, ASI ని కేవలం VRS కు పంపి, రెండవ పట్టణ SC సామాజిక వర్గానికి చెందిన CI నీ సస్పెండ్ చేయడం నిజం కాదా? నేరం జరిగింది ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కింద కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనేకమైన హామీలు ఇచ్చారు. హామీలు నెరవేర్చపోవుగా….రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తూ వారి కుటుంబ సభ్యులను మనోవేదనకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పైన వేధింపులు తక్షణమే ఆపాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కలికిరి JNTU కాలేజీలో సూపర్డెంట్ పోస్టు లేనప్పటికీ అక్కడికి MD. నాగభూషణ్ ని ట్రాన్స్ఫర్ చేసి గత రెండేళ్లుగా వేధిస్తున్నారు. నాగభూషణం తన మనోవేదన వ్యక్తపరిస్తే సస్పెండ్ చేయడం నీచమైన హేయమైన చర్య. SKU యూనివర్సిటీలో MA. లక్ష్మణరావు అనే BC లీడర్ ని నిన్నటి రోజు సస్పెండ్ చేయడం దారుణం. అర్హత లేని వ్యక్తికి ఎస్కేయూ యూనివర్సిటీ VC పదవి ఇవ్వడం చాలా హేయమైన చర్య. చాలా శాఖల్లో ప్రభుత్వ సామాజిక వర్గానికి చెందిన అర్హత లేని వ్యక్తులకు ఉన్నత పదవులు కట్టబెట్టడం నిజం కాదా? అని ప్రశ్నించారు. సాక్షాత్తు పోలీస్ శాఖ సంబంధించిన ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తూ కేసులు కట్టి జైలుకు పంపిస్తుంటే సంఘవిద్రోహ శక్తులకు, రౌడీషీటర్లకు పోలీసులు పైన చులకన భావం ఏర్పడి, నంద్యాలలో రౌడీషీటర్లు గత నాలుగు రోజుల కింద పోలీస్ కానిస్టేబుల్ ని వెంటాడి వేటాడి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ సంఘటన చూసినంక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయిందని అర్థం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల ఉద్యోగస్తులు పైన వేధిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు తీర్చలేదని అసహనంతో ఉన్నారు,YCP నాయకులు అన్ని ప్రభుత్వ శాఖల్లో తలదొరుస్తూ విధులకు ఆటంకం కల్పిస్తూ భౌతిక దాడులు కూడా దిగుతున్నారు. జగనన్న ” విష్ యు ఆల్ ది బెస్ట్” ఇండియా టుడే సర్వప్రకారంగా ఇండియాలోనే మీరే బెస్ట్ సీఎం అంట కదా!! మేమైతే ఇది నమ్మం గానీ!! మీ శ్రేణులకు అయితే ఇది పెద్ద బూస్ట్? మొత్తానికి మీ సభల్లో డ్రామా ఆర్టిస్టులు, డ్రామా సర్వేలు ప్రజల్ని బాగా పంపించే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులపై జరుగుతున్న అక్రమ దాడుల్ని, అన్యాయాల్ని ఆపకపోతే ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వం మెడలు వంచుతాం అని హెచ్చరిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way