విజయవాడ ( జనస్వరం ) ; విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఘాట్ రోడ్డు కొండ చెరియలు జారిపడిన ప్రాంతాన్ని మరియు కేశఖండనశాలను జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ నగర కార్యదర్శి కొరగంజి. వెంకటరమణ ,నగర అధికార ప్రతినిధి ముద్దాన .స్టాలిన్ మరియు నాయకులు చిప్పల. కృష్ణ గారితో కలిసి సందర్శించారు. అదృష్టం బాగుండి ఎటువంటి నష్టం జరగలేదు. ఆలయ ఈవో, అధికారులు & పాలకమండలి తక్షణమే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఘాట్ రోడ్డు పై కొండ చెరియలు జారి పడకుండా తగు రక్షణ చర్యలు చేపట్టాలి. శ్రావణమాసంలో అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది,ఆలోపే ఘాట్ రోడ్డుపై రాకపోకలను పునరుద్దించాలి. వేలాది మంది భక్తులు వచ్చి ఎంతో పవిత్రంగా అమ్మవారికి తలనీలాలు సమర్పించే కేశఖండనశాలలో వసతులు అధ్వానం. దుర్గా ఘాట్ లో పవిత్ర స్నానం ఆచరించేందుకు అవకాశం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com