ముంపుకు గురైన వీధులను పరిశీలించిన జనసేన నాయకులు
తుఫాను ప్రభావం టెక్కలి మేజర్ పంచాయతీ పై అధికంగా పడిందని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు అన్నారు. పంచాయతీ పరిధిలో తుపాన్ తాకిడికి గురైన కొన్ని కాలనీలతో పాటు స్థానిక మండాపొలం కాలనీ నీట మునిగిపోయిన దృష్ట్యా బుధవారం నాయకులు వీధుల్లో పర్యటించారు. ముంపు ప్రభావిత ప్రాంతంలో పంచాయతీ అధికారులు మోటార్ పంపు సహాయంతో నీటిని తోడే యత్నం చేశారు. అయినా వర్షపాతం ఎక్కువగా నున్న కారణంచేత అక్కడ నీరు తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదని స్థానికంగా నివాసం ఉంటున్న వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముంపు నీటిని తోడేందుకు అదనంగా మరో మోటార్ పంపును అధికారులు సమకూర్చలని జనసేన నాయకులు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో హనుమంతు దిలిప్, పసుపురెడ్డి సోమేశ్, రాయి సునీల్, బొడ్డేపల్లి వెంకటేష్, తోట శ్యామ్, సంజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com