ప్రత్తిపాడు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా గొర్లవారిపాలెం గ్రామంలో మరియు పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలం వైకుంఠ పురం గ్రామాల్లో JSP ROYAL SOLDIERS, గుంటూరు రూరల్ మండల జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా రైతులను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి జనసేన పార్టీ అండగా ఉంటుంది అని, రైతులకు పెన్షన్ స్కీమ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. కనీస మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని, ప్రకృతి వైఫరీత్యాల వలన కలిగే ఇబ్బందులని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన సహాయ నిధిని బలోపేతం చేసి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో JSP ROYAL SOLDIERS అధ్యక్షులు అన్నదాసు వెంకట సుబ్బారావు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి పాకనాటి రమాదేవి, రెల్లి సంఘం రాష్ట్ర నాయకులు & జిల్లా జనసేన నాయకులు సోమి ఉదయ్ కుమార్, గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శి డేగల లక్ష్మణ్, గుంటూరు, అమరావతి మండలాల పార్టీ అధ్యక్షులు గంధం సురేష్, వాకా అఖిల్, గుంటూరు మండల ఉపాధ్యక్షుడు కూనపురెడ్డి గంగాధర్, కోట కాళి, పగడాల వెంకటేశ్వరరావు, వురుబండి లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com