Logo
Date of Publish : 27 October 2023, 10:55 pm
Editor : Sake Naresh

కోన తాతారావును సత్కరించిన జనసేన నాయకులు

   విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖపట్నం జిల్లా అర్బన్ జనసేన పార్టీ సమన్వయకర్తగా నియమితులైన కోన తాతారావుకు విశాఖ అర్బన్ నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నేతలు, జనసైనికులు, వీర మహిళలు అభినందనలు తెలిపి, ఘనంగా సత్కరించారు. జనసేన, టీడీపి కార్యాచరణకు అనుగుణంగా రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని చూచించారు. గాజువాక జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కోన తాతారావు మాట్లాడుతూ పార్టీ తనకు అప్పగించిన పదవిని క్రమశిక్షణతో, కచ్చితత్వంతో నిర్వహిస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పు తప్పదని కోన తాతారావు వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు మాట్లాడుతూ కోన తాతారావు గారికి విశాఖపట్నం జిల్లా అర్బన్ జనసేన పార్టీ సమన్వయకర్తగా నియమించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు తెలిపారు. పార్టీలో ఇటువంటి వ్యక్తులకు సరైన అవకాశాలు లభిస్తే, మరింత మంది యువత స్ఫూర్తిదాయకంగా పార్టీ కోసం పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ నార్త్ ఇంచార్జి పసుపులేటి ఉషాకిరణ్, కార్పొరేటర్లు దల్లి గోవింద్ రెడ్డి, కందుల నాగరాజు, పీతల మూర్తి యాదవ్ జనసేన సీనియర్ నాయకులు తిప్పల రమణ రెడ్డి, పోల రౌతు వెంకటరావు, కాదా శ్రీను, లంకల మురళి దేవి, దాసరి జ్యోతి రెడ్డి, మాక శాలిని, వబ్బిన శ్రీకాంత్, చందక ములకలపల్లి వంశీ, బత్తుల శ్రీను (వీరబాబు), గందం వెంకట్రావు, మజ్జి వినోద్, మొల్లి వెంకటరమణ, గలకోటి సోమన్న, కనకేశ్వరావు, ముసలయ్య, నూకరాజు, కనక దుర్గ, రవీంద్ర, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com