
విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖపట్నం జిల్లాను గంజాయి హబ్ గా మార్చిన ఘనత వైసీపీదేనని విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు ధర్మేంద్ర అన్నారు. గతంలో విశాఖ అనగానే ఆర్కే బీచ్, అరకు అందాలు, విశాఖ ఉక్కు గుర్తొచ్చేవని, ఇపుడు దేశం నలుమూలల ఎక్కడ గంజాయి దొరికిన దాని మూలాలు విశాఖ ఏజెన్సీ నుంచే అవ్వడంతో విశాఖ జిల్లాకు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే కొంతమంది స్థానిక వైసీపీ నాయకులని ఏకీ పారేశారు. ఇది ఒక ఆదాయ వనరరుగా, అలాంటి నాయకుల స్వార్థం వల్ల గిరిజన యువత తీవ్రంగా నష్టపోతుంది. గిరిజన యువతకు ప్రభుత్వం ఉపాధి అవకాశం మరియు వాళ్ళకి భరోసా కల్పించాలి కానీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేదు. ఈ పరిస్థితుల్లో గిరిజన యువత తప్పు దారిన పడుతున్నారని యుద్ధప్రాతిపదికన ఈ యొక్క గంజాయి సాగుని నిర్మూలించాలని జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీకాంత్, శివ, నగేష్, మూర్తి, తిరుమల రెడ్డి, ప్రకాష్, కిరణ్, సందీప్, గని, సతీష్, తులసి లక్ష్మణ్, గౌతమ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.