జనసేన నాయకులు గజ్జల సాయి కుటుంబానికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు : ఆదుకున్న కడప జనసేన నాయకులు
కరోనా బారినపడి పాల్గొన్నప్పటికీ గుండె జబ్బు చేసి అనారోగ్యం తో బాధ పడిన టువంటి జనసేన పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి గజ్జల సాయి తండ్రిని వారి ఇంటికి వెళ్లి పరామర్శించి జనసేన గల్ఫ్ NRI సేవా సంస్థ నాయకులు శేట్టిపల్లే వెంకట ప్రసాద్, శంకర్ గుంటూర్, తాళ్ళపాక హరికృష్ణ, ఆనంగి ప్రసాద్ గార్లు పంపించిన 5 వేల రూపాయల నగదు సహాయాన్ని అందించిన జనసేన పార్టీ నగర అధ్యక్షుడు మాలే శివ, లీగల్ సెల్ నాయకులు తోట బాలసుబ్రహ్మణ్యం గారు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో సామాజిక రాజకీయ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజానీకం విషయంలో కానీ ప్రపంచమంతా ఎదుర్కొంటున్నటువంటి కరోనా మహమ్మారి బారిన పడి విలవిలలాడి పోయి సహాయం కోసం ఎదురు చూస్తున్న నిస్సహాయ ప్రజల విషయంలో కానీ, జనసేన పార్టీ జనసేన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు జనసైనికులు అందరూ కూడా ఉదారంగా మంచి మనసుతో సేవాతత్పరత తో సామాజిక బాధ్యతను స్వీకరించి వారివారి కష్టార్జితాన్ని వెచ్చించి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ దేశం లో ఏ రకమైనటువంటి అధికారాన్ని అనుభవించకుండా కుటిల రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా నిస్వార్ధంగా ప్రజలకు సామాజిక బాధ్యతతో సేవలందించిన ఏకైక రాజకీయ పార్టీ జనసేన పార్టీ అని ఆయన అన్నారు. ప్రజలకు కష్టం అనగానే దూర దేశాలలో కష్టించి సంపాదించిన వారి సొంత సంపాదన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ప్రజల కష్టాలు తీర్చడానికి ఉపయోగిస్తున్నటువంటి జనసేన గల్ఫ్ సేవా సంస్థ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అను తెలియజేస్తున్నాము అన్నారు. జనసేన నాయకుడు గజ్జల సాయి తండ్రికి చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించిన జనసేన గల్ఫ్ NRI సేవా సంస్థ శేట్టిపల్లే వెంకట ప్రసాద్, శంకర్ గుంటూర్, తాళ్ళపాక హరికృష్ణ, ఆనంగి ప్రసాద్, గార్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.