గుంటూరు, (జనస్వరం) : జనసేన పార్టీ కార్యకర్త ముసుగులో పార్టీ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ పార్టీ కి తీవ్ర నష్టం చేకూర్చితే చూస్తువురుకోమని గుంటూరు జిల్లా జనసేన పార్టీ మీడియా అధికార ప్రతినిధి తవిటి భావన్నారాయణ అన్నారు. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన నూతి నాగరాజు s/o పుల్లయ్య అనే వ్యక్తి సామాజిక మాధ్యమంలో “ప్రజానాడి ఆంధ్రప్రదేశ్ ” ఐడీ పేరుతో ఫేస్బుక్ లో పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ని, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుని, జిల్లా కార్యవర్గ సభ్యులను, మండల అధ్యక్షులను ఇష్టమోచ్చినట్లుగా తిడుతూ పోస్టులు పెడుతున్నందున ఇది పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నందున, అతను పార్టీలో ఎప్పుడు కూడా క్రియాశీలకంగా లేనందున అతనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. జనసేన పార్టీపై ఆ పార్టీ పదవుల్లో వున్న వ్యక్తులపై తప్పుడు పోస్టులు పెడుతున్నందున చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. సిఐ మధుసూదన రావుని తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరడం జరిగింది. ఇకపై పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా అతని పోస్టులకు స్పందించరాదని ఖచ్చితంగా పార్టీ నిబంధనలకు లోబడే ప్రతి కార్యకర్త పనిచేయాలని, సామాజిక మద్యమాలలో అనుచిత పదాలను వాడకూడదని జిల్లా మీడియా అధికార ప్రతినిధి తవిటి భావనారాయణ కోరారు. ఈ సందర్భంగా పార్టీ చేసిన తీర్మానాన్ని మీడియా సమావేశంలో విడుదల చేసారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, బడిదెల శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి సయ్యద్ జాన్ షరీఫ్, దూదేకుల కాశిం సైదా, మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, మందపాటి దుర్గారావు, బొమ్మా శ్రీను, ఉప్పిడి నరసింహారావు, రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నరసయ్య, సత్తెనపల్లి పార్టీ ఆఫిస్ ఇంఛార్జి మణికంఠ, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ మెంబెర్ సలీమ్, బేతంచర్ల ప్రసాద్, బయ్యవరవు రమేష్, గుర్రంకోటి బ్రదర్స్, వంశీ, మదినా, అంబటి సాయి, ఆవుల రమేష్, వంశీ, ఇతర కార్యకర్తలు హాజరయ్యారు.