
విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖపట్నం 88వ వార్డులో గల ప్రైమరీ హెల్త్ సెంటర్ లో గత 4 నెలల నుండి సరైన సదుపాయాలు, స్టాఫ్ లేకపోవడం వలన వైద్యం నిమిత్తం వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక జనసేన పార్టీ నాయకులు శ్రీ వబ్బిన జనార్థన శ్రీకాంత్ గారు వార్డు సచివాలయం అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. అధికారులతో మాట్లాడుతూ 4 నెలల క్రితం ఈ వైద్య అనే ప్రైవేట్ సంస్థ ఆధీనంలో అందుబాటులో ఉన్నప్పుడు కొంత వరకూ ప్రజలకు వైద్యం అందేదని, ఇప్పుడు ఈ PHC లు ను ప్రభుత్వాధీనంలో తీసుకున్నప్పుడు నుండి కనీసం వ్యాధి నిర్ధారణ రక్త నమూనా పరీక్షలు చేసుకోవడానికి వీలుకల్పించే కుండా, కేవలం ఒకే ఒక డాక్టర్ తో నరవ PHC ని నడుపుతున్నారని, క్లీనింగ్ చేయడానికి కూడా అక్కడ స్టాప్ లేరని, డాక్టర్ గారు అన్ని చూసుకుంటున్నారని, పూర్వం రోజుకి 90 మంది పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ అందుకునే వారిని, ఇప్పుడు సదుపాయాలు లేకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన నరవ PHC లో సదుపాయాలు ఏర్పాటు చేయమని కోరడం జరిగింది.