Logo
Date of Publish : 15 April 2021, 5:30 am
Editor : Sake Naresh

అంబేద్కర్ జయంతి సందర్భంగా జ్ఞానపురం ప్రాంతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జనసేన నాయకుల శాంతియుత నిరాహారదీక్ష

                        డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ విశాఖపట్నంలో  జనసేన నాయకులు శాంతియుతంగా నిరాహారదీక్ష చేపట్టారు.  రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి ఆశయాలతో విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో 41వ వార్డులో నేటి వైసీపీ ప్రభుత్వం వారి హామీలలో పొందుపరిచిన వృద్ధులకు పెన్షన్ పెంపుదల ఆలస్యం పైనా మరియు 41వ వార్డు జ్ఞానపురం ప్రాంతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శాంతియుతమైన నిరసన తెలియజేశారు.  41వ వార్డు యువత మరియు జనసేన కార్యకర్తలు ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5గంటలవరకు నిరాహార దీక్షలో ఉన్న సాయంత్రం 5 గంటల వరకు దివ్యంగుడైన రాజు, మరియు 41వ వార్డు నాయకులు శేఖర్ ఆంటోని పాల్గొన్నారు. ప్రభుత్వంతో పనిచేయించుకోవటం మన హక్కు, ఈ హక్కులను ఎవరు కాలరాసినా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి స్పూర్తితో ఎదుర్కోవాలని జనసేన ఉద్యమ నేత శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ గారు వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష వీరమింప చేశారు.   తదనంతరం వన్నెం సతీష్ గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఎక్కడా చూసినా దోపిడి దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయని, ప్రజలకు ప్రశాంతంమైనా పరిపాలనా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను, పథకాలను అమలు చేయకుండా కాలాయాపన చేస్తున్నారన్నారు. త్వరలోనే ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులు వస్తాయని, అంత వరకూ సహనంతో వేచి చూద్దాం అన్నారు.  ఈ దీక్షకు 30వ యజ్ఞశ్రీ గారు, దక్షిణ నియోజకవర్గ నాయకులు, జనసైనికులు వీరమహిళలు మద్దతు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com