జనసేన క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన గిద్దలూరు జనసేన నాయకులు

      గిద్దలూరు, (జనస్వరం) : గిద్దలూరు నియోజకవర్గం, బేస్తవారిపేట మండలం, గలిజేరుగుళ్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు చింతలపూటి చంద్రమోహన్ గత నెల 24వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఒంగోలు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న గిద్దలూరు ఇంఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు, చంద్రమోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ ఆర్ధిక సాయంగా రూ. 25 వేలు అందచేశారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు వర్తించే బీమా రూ. 5 లక్షలు కూడా త్వరలోనే వచ్చే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే చంద్రమోహన్ మృతి తీరని లోటని ఆ కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లంకా నరసింహారావు, కాల్వ బాలరంగయ్య, తాడిశెట్టి ప్రసాద్, వాటర్ హుస్సేన్, కులార విష్ణు, ధుమ్మని చెన్నయ్య, మహేష్ జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way