గజపతినగరం ( జనస్వరం ) : విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం, నరవ గ్రామంలో గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ భద్రమ్మతల్లి, బంగారమ్మతల్లుల పండుగ సందర్బంగా మే 23, 24 తేదీల్లో గజపతినగరం నియోజకవర్గం నాయకులు మార్రాపు సురేష్ & నరవ జనసేన నాయకులు ప్రతీరోజు గ్రామమంతా నాలుగు ట్రాక్టర్ల ట్యాంక్ వాటర్ సప్లై చేస్తూ, మజ్జిగ చలివేంద్రం నిర్వహిస్తూ, పులిహోర, బూందీ, ప్రసాదాన్ని గ్రామస్తులందరికి పంచిపెట్టారు. మంగళవారం నాడు జనసేన నాయకులు మర్రాపు సురేష్ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామస్తులకు, భక్తులకు ప్రసాదాన్ని, మజ్జిగను పంచిపెట్టారు. ఈ సందర్బంగా జనసేన నాయకులు మర్రాపు సురేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ పోరాడటంతో పాటు,ప్రజలకు సేవలు అందించడంలో కూడా ముందు ఉంటుందని, పండుగ చివరి రోజైన బుధవారం కూడా ఈ సేవలు, ప్రసాదం వితరణ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరవ జనసేన నాయకులు రాంబాబు, రాజు, జనసేన పార్టీ సీనియర్ జిల్లా నాయకులు ఆదాడ మెహనరావు, మిడతానా రవికుమార్, దంతులూరి రామచంద్ర రాజు, భాస్కర్, పండు, త్యాడ రామకృష్ణారావు(బాలు), ఆదినారాయణ, శ్రీధర్ పాల్గొన్నారు.