రాష్ట్రంలో ఇటీవల ఇంటి పన్నులు, చెత్త పన్ను పెంచుతూ జీవో 195, 196, 198 ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంటి పన్నులు మరియు చెత్త డ్రైనేజీ పన్నులు పెంచడంపై నిరసన వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చిన జనసేన నాయకులు. ఈ సందర్భంగా జనసేన నాయకులు జయ ప్రకాష్ గారు మాట్లాడుతూ కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ప్రజలపై ఇలాంటి చెత్త పన్నులు, ఇంటి పన్నులు, డ్రైనేజీ పై యూజర్ చార్జీలు మోపడం చాలా దారుణం అని అన్నారు. పథకాల రూపంలో ప్రజలకు ఓ చేత్తో ఇస్తూ మరోచేత్తో పన్నుల రూపంలో ఇలా లాక్కోవడం భావ్యం కాదు. శ్రీకాళహస్తిలో కొత్తగా పెంచిన పన్నులను గూర్చి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజాభిప్రాయసేకరణ జరపిన తరువాతే కొత్త పన్ను విధానంపై ముందుకెళ్ళాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ప్రజలు కరోనా కష్టాల్లో ఉన్నందున గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విధంగా మన రాష్ట్రంలోనూ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను రద్దు చేయాలని, వైద్య సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలను కరోనా బారి నుండి కాపాడాలని ఆస్తి ఆధారిత ఇంటి పన్ను విధించే చట్టం సవరణ జీ.వో. 198 రద్దు చేయాలని చెత్త సేకరణపై యూజర్ చార్జి పూర్తిగా నిలిపివేయాలని మంచినీరు /డ్రైనేజీ ఛార్జీలు పెంచే జి.ఓ.196,195 రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొట్టే సాయి, జయ ప్రకాష్, కుమార్, మహేష్, చిరంజీవి, ఢిల్లీ బాబు, మహిళా నాయకులు సునీత మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com